Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆజామాబాద్ బస్తీలో క‌లుషిత‌, లో ప్రెష‌ర్ నీటి సమస్యను పరిష్కరించాలి ...

ఆజామాబాద్ బస్తీలో క‌లుషిత‌, లో ప్రెష‌ర్ నీటి సమస్యను పరిష్కరించాలి – సిఐటియు, ఐద్వా

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం విఎస్‌టి ఆజామాబాద్ బ‌స్తీలో మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ కార్యాల‌యం వ‌ద్ద సిఐటియు, ఐద్వా ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ…ఆజామాబాద్ బస్తీలో గత సంవత్సర కాలం నుండి మంచినీరు కలుషితంగా వస్తున్నాయని, కలుషిత మంచినీరు తాగటం మూలంగా బస్తీ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. మంచినీటి లో ప్రెజర్ స‌ర‌ఫ‌రా కావ‌డంతో బ‌స్తీవాసులు రోజు వారి అవ‌స‌రాలు కూడా తీర్చుకొనేందుకు ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. బస్తీ వాసులు అనేక సందర్భాల్లో వాటర్ వర్క్స్ అధికారులకు సమస్యపై విన్నపించిన పట్టించుకోలేదన్నారు. అధికారులు వెంటనే అజామాబాద్ బస్తీలో మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ధ‌ర్నా అనంత‌రం వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్ రాజ్‌, మేనేజ‌ర్ శివ ల‌తో స‌మ‌స్య‌ల పై చ‌ర్చించారు. ఈ ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో ఐద్వా నగర అధ్యక్షురాలు ఏ.పద్మ, సీఐటీయూ ముషీరాబాద్ జోన్ నాయకులు ఆర్.వెంకటేష్, ఏ.శ్రీరాములు, బస్తీ వాసులు జి.రాధిక, బి సాహితీ, బి.స్పూర్తి, రాణి, బాలమణి, మాధవి, రేవతి, నరసమ్మ, రాజమణి, సాయమ్మ, అంజమ్మ, లలిత, రూప, రాజేశ్వరి, అంజమ్మ, శ్యామల, లత, అనసూయా బాయి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page