Sunday, September 27, 2026
No menu items!
Homeculturalsవిమలక్క 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభం

విమలక్క 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) :   ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి, జానపద రూపాలను కాపాడుకోవాలని,,భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విష సంస్కృతిని నశించాలని, సమసమాజం కావాలని, దోపిడి పీడన నశించాలని నినాదాలు చేస్తూ వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ వేలాది మంది ప్రజా కళాకారులతో ప్రజా కళాజాతర ర్యాలీ హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాయకత్వం వహించారు. ర్యాలీ ఆర్టీసీ కళ్యాణ మండపం చేరుకున్న తర్వాత సభాప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జెండాను అరుణోదయ సీనియర్ కార్యకర్త అంబిక ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మల్సూర్ ఓ అరుణ పతాకమా గీతాలాపన చేశారు. సభాప్రాంగణం అవరణలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రొఫెసర్ శాంతా సిన్హా ప్రారంభించారు. 50 ఏళ్ళ కాలంగా విమలక్క విప్లవ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, బహుజన బతుకమ్మ కార్యక్రమాలలో భాగంగా
తెలంగాణ గ్రామ గ్రామాన తిరిగి పాల్గొన్న కార్యక్రమాలను తెలియజేస్తూ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా కళాజాత సభా కార్యక్రమాన్ని అంకురం సినిమా దర్శకుడు ఉమామహేశ్వరరావు ప్రారంభి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజా సంస్కృతి వైపు నిలవడం చాలా కష్టమైందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంస్కృతి చలన శీలం గలదని, ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ నిజం వైపు నిలబడుతుందని తెలియజేశారు.

50 ఏళ్ల విమలక్క ప్రజా సంస్కృతి వైపు నిలవడం గొప్ప విషయని, 50 ఏళ్లుగా విమలక్క జనంలో ఉండి జనంతో మాట్లాడిందన్నారు. జనం కోసం కొట్లాడిన ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, నిర్బంధాలను ఎదుర్కొందన్నారు. ప్రజా సంస్కృతి వైపు నిలబడిన కళాకారులందరి పై రాజ్యం ఏదో రకంగా అంక్షలు పెట్టడం, నిర్బంధాలు పెట్టడం గతం నుంచి కూడా కొనసాగుతునే ఉందన్నారు. వినాయకచవితి భావజాలం ప్రజలను భ్రమల్లో ఉంచడం మాత్రమే అని, ప్రజా సంస్కృతి నిజం వైపు, ప్రజల వైప నిలబడుతుందన్నారు. ఈ విష సంస్కృతి పల్లె భాషను, ప్రజా కళా రూపాలను నీచంగ చూడడం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంలో జానపద కళారూపాలు ప్రజల ఆయుధాలు కావాలని.. ప్రజల కళారూపాలను రకాలుగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం కొనసాగిస్తుందన్నారు. జానపద కళారూపాలు ప్రజల గుండెచప్పుడని.. వాటిని ఆధునీకరించుకోవాల్సన అవసరం ఉందన్నారు. ప్రజల కళారూపాలు జనం వద్దకు వెళ్లాలని, ప్రజల కళారూపాలు రేపటి తరంలోకి తొంగి చూడాలన్నారు. ఈ లక్షణం విమలక్క లో గొప్పగా ఉండటమే కాక అటు వైపుగా 50 ఏళ్లగా విమలక్క తన ప్రయత్నం చేస్తున్నారన్నారు. నేటి యువత ప్రజా సంస్కృతికి మద్దతుగా నిలబడాలని కోరారు. విమలక్క నేతృత్వం సిగ్నేచర్ డాన్స్, అమరులకు జోహార్లర్పిస్తూ వీరుల సన్నిధి పాట,.వీరనారి ఐలమ్మ 131 జయంతి సందర్భంగా అమె ఫోటోకు పూల మాల వేసి జోహార్లర్పించారు. ఈ ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా న్యూఢిల్లీ ప్రముఖ జర్నలిస్టు భాషా సింగ్, ప్రజా కళాజాతర ఆహ్వాన సంఘం ముఖ్యులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ చక్రధరరావు, కట్టా భగవంత రెడ్డి, ప్రొఫెసర్ వినయ్ బాబు, రమేష్ పోతుల, మల్సూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ, ప్రజా కళాజాతర కార్యక్రమానికి నోట్ ప్రవేశపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page