హైదరాబాద్, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) : వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాంనగర్ కా రాజా వినాయకుడి లడ్డూ వేలం పాట జరిగింది. ఈ లడ్డూ భారీ ధరలో వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో అఖిల్ యువసేన 6 లక్షల 15 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా త్రిశూల్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సాయి సంతోష్ ఆధ్వర్యంలో లడ్డూ విన్నర్ అఖిల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయి సంతోష్ మాట్లాడుతూ… ప్రతి ఏటా మాదిరిగానే రాంనగర్ కా రాజా వినాయకుడి లడ్డూను భారీ ధరలో వేలం పాట పాడారన్నారు. గత సంవత్సరం కంటే ఈ సారి భారీ ధర పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు రాజు, గోపి, మణికంఠ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్ కా రాజా లడ్డూ వేలం – ఆరు లక్షల 15 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్న అఖిల్
RELATED ARTICLES

