Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalఘ‌నంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ - శ్రీ పోచమ్మ దేవాలయం ప్రారంభోత్స‌వం

ఘ‌నంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ – శ్రీ పోచమ్మ దేవాలయం ప్రారంభోత్స‌వం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 5, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ స‌బర్మ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో ఇటీవ‌ల పున‌ర్నిర్మాణం చేసుకున్న శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ శ్రీ పోచ‌మ్మ దేవాల‌యం ప్రారంభోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్వాహ‌కులు ల‌క్ష్మ‌ణ్‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నాయకులు ఉమేష్,ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, సాయి సంతోష్, ప్రశాంత్, ఆలయ నిర్వాహ‌కులు నర్సింగ్, కమిటీ సభ్యులు నర్సింగ్ ముదిరాజ్, లక్ష్మణ్, జగన్, డి.కుమార్, జివై.గిరి, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page