పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్‌లో గల శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ఆవరణలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కెహెచ్ఎస్.జగదాంబ, సంస్థ ఛైర్మన్ కోడూరు శ్యామల రావు నిర్వాహణలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యూరు శేష సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ… స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తించుకొని, స్మరించుకొని భారతీయులందరూ కలిసి మెలిసి ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. శేష సాయి మాట్లాడుతూ… దేశ ప్రజలందరూ క్రమశిక్షణతో, దేశభక్తితో దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడి సత్యనారాయణ, కేశవ్, సంస్థ ప్రధాన కార్యదర్శి బంగారు ప్రశాంత్, కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యుడు కోదాడ వెంకటేశ్వరరావు, కోడూరు పద్మ, బిజెపి నాయకులు పి.సాయి కృష్ణ యాదవ్, కర్ర వెంకటేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply