Sunday, September 20, 2026
No menu items!
HomeNationalDevesh Mistry: దుబాయ్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి

Devesh Mistry: దుబాయ్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యూఏఈ డిజిటల్ డిజైన్ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేశ్ మిస్త్రీ (Devesh Mistry) దుబాయ్‌లో మృతి చెందారు. ‘రెడ్ బ్లూ బ్లర్ ఐడియాస్’ (RBBi) సంస్థకు సహ వ్యవస్థాపకుడైన దేవ్‌ మిస్త్రీ ‘సూపర్‌మ్యాన్’గా సుపరిచితులు. ఆయన యూజర్-ఫ్రెండ్లీ డిజైన్లు చాలా ప్రసిద్ధిగాంచాయి. యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మెంటార్‌గానూ వ్యవహరించేవారు. ఆయన మృతికి గల కారణాన్ని కంపెనీ వెల్లడించలేదని ‘గల్ఫ్‌న్యూస్‌’ ఓ కథనంలో వెల్లడించింది.

2011లో అమోల్ కదమ్‌తో కలిసి దేవేశ్ మిస్త్రీ (Devesh Mistry) స్థాపించిన RBBi సంస్థ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ పరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కంపెనీ యూఏఈలో మొట్టమొదటి స్పెషలైజ్డ్ యూఎక్స్, యూఐ ఏజెన్సీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముంబై యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన దేవ్‌ తొలినాళ్లలో కోడింగ్‌లో పనిచేశారు. ఆ తర్వాత యూజర్ ఎక్స్‌పీరియన్స్ (UX) ప్రాధాన్యాన్ని గుర్తించి సొంత వ్యాపారం మొదలుపెట్టారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, మాస్టర్ కార్డ్ వంటి అనేక అంతర్జాతీయ బ్రాండ్స్‌తో పనిచేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page