Friday, September 18, 2026
HomeHyderabadఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి...

ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు

– ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :   

       గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్,  డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ లతో కలిసి హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య పార్క్‌, క‌వాడిగూడ‌ల‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ అధికారులు లబ్ధిదారులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే ఉదయం నాణ్యమైన అల్పాహారం, రూ.5 కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శనం మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సారధ్యంలో జీహెచ్ఎంసీ సౌజన్యంతో నిర్వ‌హిస్తున్న‌ ఇందిరమ్మ క్యాంటీన్లతో హైదరాబాద్‌లో ఉపాధి కోసం, పనుల కోసం వచ్చే ప్రజలు, పేదలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పదాయవర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లు మాట్లాడుతూ… పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇందిరమ్మ క్యాంటీన్ లు ఎంతో ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్ లకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page