Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఐ అండ్ పీఆర్ జేడీ జగన్ కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి

ఐ అండ్ పీఆర్ జేడీ జగన్ కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి

📰 Generate e-Paper Clip

ఐ అండ్ పీఆర్ జేడీ జగన్ కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి
– అభినందనలు తెలియజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన జాయింట్ డైరెక్టర్ డిఎస్.జగన్ కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ ( ఐ అండ్ పీఆర్ కార్యాలయం ) లో జగన్ ను కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. సోమయ్య తో పాటు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, రామారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.పాండురంగారావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, రంగారెడ్డి జిల్లా నాయకులు నంబి పర్వతాలు, గోవింద్ నాయక్, ఎం.రవికుమార్ తదితరులు నూతన అడిషనల్ డైరెక్టర్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన డిఎస్.జగన్ కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page