కాళోజీ వర్శిటిలో అవకతవకలపై విచారణ జరిపించాలి
– పీజి వైద్య విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 7, అద్దం న్యూస్ : కాళోజీ వర్శిటిలో అవకతవకలపై విచారణ జరిపించాలని పీజి వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో విలేకరుల సమావేశంలో డాక్టర్.వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ…కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విడుదల చేసిన ఎండి, ఎంఎస్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్‌లో విడుదల చేసిన ఫలితాల్లో ఒకటి, రెండు మార్కుల తేడాతో సుమారు 80 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఇటీవల ఈ ఫలితాల్లో తప్పిదం జరిగిందని ఓ అభ్యర్థికి మార్కులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పరీక్ష ఫలితా లను త్వరగా ఇవ్వాలని, తమకు కూడా రీ వాల్యుయేషన్ లేదా డీఎన్‌బికి కల్పించిన ఎనిమిది గ్రేస్ మార్కులయినా ఇవ్వాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్లు శ్రీనివాస్ గుప్తా, ముఖరం, ఎండి.ముక్రరం, తబస్సుమ్, కెపిఆర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply