ఆ హలీమ్, బిర్యాని తింటే అంతే సంగతులు ?
నగరంలో పాడైన మేక, గొర్రెల మాంసం విక్రయదారుల పట్టివేత
పాడైన మేక, గొర్రె మాంసాన్ని హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న నగర వాసులు
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో పాడైన మాంసాన్ని హోటళ్లకు, ఫంక్షన్లకు విక్రయిస్తున్న వారి అరెస్టులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా గడిచిన రెండు, మూడు రోజుల్లో పాడైన గొర్రె, మేక మాంసాన్ని ఫ్రిడ్జ్‌ల్లో పెట్టి తక్కువ ధరకు విక్రయిస్తున్న వారిని అరెస్టుల గురించి తెలిస్తే అసలు హలీమ్ తినాలా ? వద్దా ? ఫంక్షన్లల్లో బిర్యానీలు తినాలా ? వద్దా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ వారం రోజులుగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళ్‌హాట్, పురానాపుల్, జియాగూడలో కూడా దాడి చేసి, భారీ మొత్తంలో చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ (సౌత్-వెస్ట్) బృందం మంగళ్‌హాట్‌లోని A నుండి Z గొర్రెలు, మేకల మాంసపు దుకాణంపై దాడి చేసి, పాత జంతువుల మాంసాన్ని చట్టవిరుద్ధంగా నిల్వ చేసి విక్రయించినందుకు యజమాని మహ్మద్ అఫ్రోజ్ (40) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.8 లక్షల విలువైన 12 టన్నుల మేక, గొర్రెల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను వ్యాపారుల నుండి చౌకగా, పాడైన మాంసాన్ని కొనుగోలు చేసి, తన దుకాణంలో నిల్వ చేసి, ఆపై దానిని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో ట్రాటర్స్ (పాయ), తలలు, మెదళ్ళు, మూత్రపిండాలు, కాలేయాలు మరియు ఇతర అవయవ మాంసాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్‌ఫోర్స్, జిహెచ్ఎంసి అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో అక్రమంగా పాడైన మేక, గొర్రె మంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న మహ్మద్ మిస్బాహుద్దీన్ ( 24 ) వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహ్మద్ నిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని తక్కువ ధరకు హోటళ్లకు, ఫంక్షన్లకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు నిస్బాహుద్ధీన్ వద్ద నుంచి పాడైన మాంసం సీజ్ చేశారు. గత రెండు రోజుల క్రితంకూడా గోషామహల్ ప్రాంతంలో కూడా పాడైన మాంసం అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న విషయం గుర్తించి ఆ పాడైన మాంసాన్ని సీజ్ చేశారు.
ఈ దందా ఓల్ట్ సిటీలోనే ఎక్కువగా జరుగుతుందని అధికారులు గుర్తించారు. ఈ వరుసగా పాడైన మాంసాన్ని నిల్వ చేసి హోటళ్లకు, ఫంక్షన్లకు విక్రయిస్తున్న వింటేనే ప్రజలు భయపడుతున్నారు. హలీమ్, బిర్యానీలు తినాలా ? వద్దా ? అనే ఆలోచిస్తున్నారు. తింటే కోరి కొని తెచ్చుకుని వ్యాధులు ఎందుకు తెచ్చుకోవడమని కొంత మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పాడైన మాంసాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మరో పక్క వైద్యులు చెబుతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply