
హైదరాబాద్, నవంబర్ 9, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాజాగా సొంత పార్టీ పైనే బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు మార్క రమేష్ యాదవ్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్‌లో సీనియర్లకు గౌరవం ఉండదా ? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ” అద్దం న్యూస్ “ ప్రతినిధితో మార్క రమేష్ యాదవ్ మాట్లాడుతూ… కెసిఆర్ పై అభిమానంతో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నానన్నారు. కానీ రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకుల మాటలు విని ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆయన తనయుడు ముఠా జైసింహ లు తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. కావాలనే కుట్రలు చేసి పార్టీ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదన్నారు. ఈ నెల 8 వ తేదీ శనివారం సాగర్‌లాల్ హాస్పిటల్ నుంచి దయారా మార్కెట్ వరకు కోటి రూపాయల నిధులతో నూతనంగా సిసి రోడ్డు వేయించినందుకుగాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు బాకారం బొమ్మలగుడి వాసులు సన్మానం చేశారని, ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీలో అందరికి ఆహ్వానం పంపిన డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.
బస్తీ స్థానికుడిగా, బాకారం ధర్మచరణ సమితి కార్యదర్శిగా, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. శంకర్ ముదిరాజ్ తనకు సమాచారం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కానీ, బిఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జైసింహ లైన సమాచారం ఇప్పించలేదన్నారు. పార్టీలో కొందరు నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనను పొమ్మనక పొగపెడుతున్నారని మార్క రమేష్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ విషయం పై గతంలోనే పలుమార్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు, ముఠా జైసింహ ల దృష్టికి తీసుకెళ్లానని, కానీ వారు సైతం పట్టించుకోలేదన్నారు. ఇకనైనా పార్టీలో అందరిని సమానంగా చూడాలని, అందరికి ఒకే విధంగా గౌరవం ఇవ్వాలని, అందరికి సమాచారం ఇవ్వాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply