హైదరాబాద్, అద్దం న్యూస్ : ఖైదీలు ములాఖత్ సమయంలో తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు ఏకాంత గదులను కల్పిస్తూ ఇటీవల తీర్పును ఇచ్చిందని, ఆ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖైదీలకు ఏకాంత గదులను ఏర్పాటు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అనేక కారణాల వల్ల చాలా మంది ఖైదీలు జైళ్లల్లో సంవత్సరాల తరబడి శిక్షలను అనుభవిస్తున్నారని తెలిపారు. వారందరికి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచనలు, మానవహక్కుల సంఘాల తీర్పులు గతం కంటే ఎన్నో మార్పులు చేశాయన్నారు. ఖైదీలు సాధారణ మనిషిగా జీవించే హక్కులకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికి, కొందరికి కోర్టులు బెయిల్ ఇచ్చినా వారికి సంబంధించిన వారులేక, కోర్టుల్లో పెరిగిన పనిభారం, ఎన్నో కారణాల వల్ల తాము చేసిన తప్పుకు పడే శిక్ష కంటే ఎక్కువ రోజులు తమ జీవిత హక్కును కోల్పోతున్నారన్నారు. శిక్షపడ్డ ఖైదీలు తమ తప్పును తెలుసుకొని సత్ప్రవర్తనగా ఉన్నా, మారినా ప్రభుత్వ నిర్ణయాల ఆలస్యం వల్ల, ఇతర కారణాలు ఎన్నో ఖైదీల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నది నిజమని గోవర్థన్‌రెడ్డి అన్నారు. జైళనేది మనిషిలో పరివర్తనను తెచ్చె ఓ పాఠశాలలాంటిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతాధృక్ఫథంతో ఖైదీలు కూడా మన వారే, సమాజానికి చెందిన వారే అనే దృష్టితో చూసి వారి కోసం ఏకాంత గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply