Friday, September 18, 2026
HomeGREATER HYDERABADతెలంగాణ‌ను కించ‌ప‌రుస్తుంటే చంద్ర‌బాబు మౌనంగా ఉండ‌డం స‌బ‌బు కాదు

తెలంగాణ‌ను కించ‌ప‌రుస్తుంటే చంద్ర‌బాబు మౌనంగా ఉండ‌డం స‌బ‌బు కాదు

తెలంగాణను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడుతుంటే చంద్ర‌బాబు మౌనంగా ఉండ‌డం స‌బ‌బు కాదు
– తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :    తెలుగుదేశం పార్టీ మ‌హానాడులో తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బ‌క్క‌ని న‌ర్సింహులు తెలంగాణ అనే ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని వ్యాఖ్యానిస్తుండ‌గా ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ ఏమి ప‌ట్ట‌న‌ట్లు చంద్ర‌బాబు ఉండ‌డం స‌బ‌బు కాద‌ని తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న క‌వాడిగూడ‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ… లెలంగాణ, ఆంధ్ర అనే ప్రాంతీయ వైషమ్యాలను అధిగమించి తెలుగు ప్రజలుగా పుష్కరకాలంగా శాంతియుతంగా స్వేచ్చ‌గా సహజనం చేస్తూ ప్రభుత్వాలు మారిన అభివృద్ధిలో ముందుకు ప్రయాణిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన‌ తెలుగు ప్రజలు తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని అభినందిస్తున్నార‌న్నారు. ఆ పచ్చి నిజాన్ని అది వినే ధైర్యం లేక.. వారికి జవాబు చెప్పలేక ఓ రాజకీయ కుట్రతో మహానాడులో తెలంగాణ వాడిగా తెలంగాణపై ఎగదోసే విధంగా టిటిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బక్కని న‌ర్సింహులుతో తెలంగాణ అనే డిక్షనరీలో లేదంటూ ముందుగా చెప్పి.. చెప్పించడం దారుణ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

న‌ర్సింహులు మాటలను ఖండించాల్సిన చంద్రబాబు తదితర నాయకులు ముసి ముసి నవ్వులతో ఆధిపత్య అహంకారంతో మౌనంగా ఉండటమే అంటేనే వారి దురాలోచన ఏంటో అర్థం అవుతుందన్నారు. త్రిలింగ దేశం అంటే కాలేశ్వరం, శ్రీశైలం, దాక్షారామం అని తెలుగు నేలదే అని తెలియని అజ్ఞాని బ‌క్క‌ని న‌ర్సింహులు అని పులిగారి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధిని సహించలేని తెలంగాణ అస్తిత్వాన్ని చిన్నచూపు చూడడం వారికి పరిపాలన చేతగాని తనాన్ని కప్పించుకోవ‌డ‌మే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో దారి వెతుక్కోవడానికి రాజకీయ కుట్ర‌గా భావించాల్సి వ‌స్తుంద‌న్నారు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజల మధ్య ఓ అభ‌ద్ర‌త‌భావాన్ని సృష్టించి మేమున్నాం మీ వెంట అంటూ ఓట్లు అడగడానికి వేస్తున్న కుట్రగా భావించాల్సి వస్తుందని పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. వారి పిచ్చి పిచ్చి మాటలు వల్ల పరోక్షంగా తెలంగాణ ప్రజలను సంఘటిత పరుస్తుందని, ప్రజలే కర్ర కాల్చి వాత పెట్టడానికి వెనుకాడరనే నిజాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు. విజ్ఞత గల నాయకుడైతే చంద్రబాబు బక్కని నరసింహులు మాటలను ఖండించి.. తెలంగాణ పౌరులకు వివరణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page