తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం

తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో
చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం

హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ‌ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం జ‌రిగింది. శుక్ర‌వారం ఏసిపిని తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ స‌భ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏసిపికి శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్‌, ర‌మేష్ గాంధీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శేఖ‌ర్‌, ధ‌ర్మేంద‌ర్ జైన్‌, కోశాధికారి బాల‌కృష్ణ‌, స‌భ్యులు వ‌ల్ల‌బ్‌, కృష్ణ‌మోహ‌న్‌, న‌ట‌రాజ్‌, వ‌రుణ్‌, అనిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page