హైదరాబాద్, అద్దం న్యూస్ : బాలలపై లైంగిక దాడులు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిదని నార్త్ జోన్ అడిషినల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సి.అశోక్ అన్నారు. అప్స, యూనిసెఫ్, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధశారం నగరంలోని జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద బాయ్స్ బ్లూ అంబ్రెల్లా డే ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్త్‌జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్.సి.అశోక్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ అడిషినల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సి.అశోక్ మాట్లాడుతూ.. నేటి సమాజాల్లో బాలలపై 52 శాతం లైంగిక, మానసిక శారీరక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దీనిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు దాడులకు గురి అయిన వారు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. యూనిసెఫ్ అప్స, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ… అబ్బాయిలు వేధింపులకు గురికాకుండా చూడాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి అభి సురక్షితమైన, ఆరోగ్యమైన బాల్యాన్ని పొందే హక్కు ఉందన్నారు. ఈ సందర్భంగా బాలలు, ప్రతినిధులు బ్యానర్ పై సంతకాలతో మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మారెడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, యూనిసెఫ్ డేవిడ్ రాజ్, అప్స సీనియర్ కో -ఆర్డినేటర్ బస్వారాజ్, బొట్టు రమేష్, ఆశ్రిత సంస్థ కార్యదర్శి నాగరాజ్, డీసీపీఓ అధికారి శ్రీనివాస్, విజయ భాస్కర్, వివిధ బస్తీలకు చెందిన 100 మంది బాలలు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న నార్త్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సి.అశోక్
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
