సామాజిక సేవలో ఐవిఎఫ్ ముందంజ
దేశంలోనే అధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణకే దక్కింది
– ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ : సామాజిక సేవలో ఐవిఎఫ్ ముందంజలో ఉందని ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త లు అన్నారు. దేశంలోనే అధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణకే దక్కిందన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా ముషీరాబాద్ లోని వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చిన్న వయసులోనే ఎవరెస్ట్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించిన విశ్వనాథన్ కార్తికేయ ను వారి కుటుంబ సభ్యులను సన్మానించడం జరిగింది. పదివేల రూపాయలను ఇంజనీరింగ్ చదువుతున్న అనూష కు విద్యాభ్యాసం కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్త అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… దేశంలోని వైశ్యులందరినీ ఏకం చేయాలని మంచి సంకల్పంతో ఐవిఎఫ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే ఐవిఎఫ్ తెలంగాణ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం డాక్టర్ బాలు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సంవత్సర కాలంలోనే 2306 యూనిట్ల రక్తాన్ని, ఇప్పటి వరకు 4 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదైన మొట్ట మొదటి సంస్థగా దేశంలో నిలిచిందని అన్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పాసైన విద్యార్థులకు లక్ష రూపాయలను అందజేయడం, వైద్య శిబిరాలు, అమావాస్య, పౌర్ణమి అన్నదాన కార్యక్రమాలు, మహిళల చైతన్యం కోసం కార్యక్రమాల నిర్వహణ, ఉత్తమ విద్యార్థుల అభినందన,పేద వైశ్యులకు పుస్తె, మట్టల పంపిణీ వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలోని ఐవిఎఫ్ సామాజిక సేవలో అగ్రమగ్రమిగా నిలిచిందని అన్నారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని వైశ్య జాతి కోసమే కాక ఆపదలో ఉన్న వారికే అండగా నిలుస్తున్న ఐవీఎఫ్ సేవలను కొనియాడారు. వార్షికోత్సవం సందర్భంగా విజయవంతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించిన డాక్టర్ బాలు, కట్ట రవికుమార్, కొడిపాక నారాయణ, సంబు పాండయ్య, చింతల రజనీకాంత్, ఎర్రం చంద్రశేఖర్, కాపర్తి నాగరాజు, పబ్బ మల్లేశం, బెల్దే రవికుమార్, ఉప్పల నర్సింలు లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, కోశాధికారి కొడిపాక నారాయణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి గుప్త,సేవాదళ్ చైర్మన్ డాక్టర్ బాలు, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నీల శ్రీధర్, సలహాదారులు ముత్యాల సత్తయ్య, ఎల్‌వి.కుమార్, బోనగిరి శ్రీనివాస్, కోటగిరి శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల స్వప్న, ప్రధాన కార్యదర్శి లంకెపల్లి మంజుల, మణిమాల స్వాతి, వివిధ జిల్లాల ఐవీఎఫ్ ప్రతినిధులు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply