Friday, September 18, 2026
HomeHyderabadతెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యసాధన కోసమే జేఏసీ – ధర్మ సమాజ్...

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యసాధన కోసమే జేఏసీ – ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యసాధన కోసమే జేఏసీని ఏర్పాటు చేశామ‌ని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో సోమ‌వారం తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ జరిగింది. జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ చేతుల మీదుగా ఈ నూతన జేఏసీ ఆవిర్భావం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడానికి ఆనాడు అన్ని పార్టీలు అన్ని సంఘాలు ఒక్కటిగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర జేఏసీని స్థాపించినప్పుడే తెలంగాణలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపించడానికి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్య సాధన జేఏసీ అవసరం ఉందని భావించి ఈ వేదికని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ జేఏసీ ఒక తెలంగాణ రాజ్య సాధన దీపంగా వెలిగిద్దామని, దీనిని ఆరకుండా చేతులు అడ్డం పెట్టుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసితో కాపాడుకుందామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడానికి ఆనాడు అన్ని పార్టీలు అన్ని సంఘాలు ఒక్కటిగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర జేఏసీని స్థాపించినప్పుడు అదే తెలంగాణలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపించడానికి కూడా తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అవసరం ఉందని భావించి ఈ వేదికని ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో… తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూమి లేనప్పుడు ఆ నీళ్లు ఎవరి పొలంలో పారాలి ? అని ప్ర‌శ్నించారు. పన్నులు కట్టేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు కానీ ఆ పనుల ద్వారా వచ్చిన సొమ్మును మాత్రం అగ్రవర్ణాలు దోచుకుంటున్నారని విమ‌ర్శించారు. మరీ ఇందులో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాటా ఎంత అని ప్రశ్నించారు. తెలంగాణలో 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులు అంతిమంగా రాజ్యాధికారం కోసం ఈ నూతన జేఏసీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసోజు లలిత, అశోక్ , రాంబాబు నాయక్, తెలంగాణ విఠల్, ప్రొఫెసర్‌లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page