ఫుట్‌బాల్ ఆడి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల పై కన్ను వేసిన రేవంత్‌రెడ్డి
🔹హెచ్‌యుసి అరాచకం పై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడంలేదు
🔹 బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే రియల్ ఎస్టేట్ అంటే నేను.. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అని మాట చెప్పిండని, ఫుట్‌బాల్ ఆడి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల పై రేవంత్‌రెడ్డి కన్ను వేశారని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల కన్నా ముందే అరాచకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎందుకు రాహుల్ గాంధీ స్పందించడం లేదు ? అని కెటిఆర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులను కెటిఆర్ కలిశాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడటానికి పోరాడుతున్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దురాగతాలను కెటిఆర్ ఖండించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండా పైన ఉన్నాడని, ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపైన పర్యావరణహితం కోసం ప్రజా ప్రయోజన రాజ్యం వేయడం జరిగిందన్నారు. గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారు, మరీ అలాంటిది విద్యార్థుల పైన ఇన్ని అరాచకాలు జరుగుతున్నా పర్యావరణం పైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఎందుకు స్పందించడం లేదు ? అని అన్నారు. ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబై ఆరాయి అడవులపైన జాతీయ స్థాయిలో మాట్లాడారు… ఛత్తీస్‌గఢ్‌లో హస్దేయో అడవులను ఇతరులకు కేటాయించకుండా రాహుల్ గాంధీ మాట్లాడారు.. ఈ రోజు హైదరాబాద్ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. 
అడ్డమొచ్చిన విద్యార్థులను, ఆడ బిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసనుడి మాదిరి వ్యవహరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నదన్నారు. అక్కడ బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలు, అక్కడ ఉన్న వన్య ప్రాణులు అరుస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తలేదా రాహుల్ గాంధీ ? అని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాల్సిన అవసరం లేదా రాహుల్ గాంధీ ? అని అన్నారు. మా పార్టీ తరఫున సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని అనేకమంది అడుగుతున్నారని… విద్యార్థుల ఆందోళనను రాజకీయం చేస్తాడని మా పార్టీ తరఫున ఇప్పటిదాకా నేరుగా అక్కడికి పోలేదన్నారు. ఈ అంశాన్ని సరైన వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతామని.. పార్లమెంట్, రాజ్యసభలో మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చామని.. ప్రజాక్షేత్రంలో కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు స్మశానాలకు కూడా జాగాలు ఉండవు అంటూ చెప్పింది రేవంత్ రెడ్డి కాదా.. మరిప్పుడు అవన్నీ ఏమయ్యాయి రేవంత్ ? అని ప్రశ్నించారు. పిల్లలు ఇద్దరు యూనివర్సిటీ పిల్లలను అరెస్టు చేశారని, జైలుకి పంపించారని చెబుతున్నారు, వారికి అండగా ఉంటామన్నారు. వాళ్లకి న్యాయపరంగా అన్ని రకాల సహకారాలు అందిస్తామని.. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డీజీపీని విజ్ఞప్తి చేశారు. వైస్ ఛాన్సలర్ అనుమతులు లేకుండా పోలీసులు వెళ్తున్నారని… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్లే హక్కు పోలీసులకు ఉండదు కానీ విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయ భ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆడ పిల్లలను కూడా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూముల పైన చేస్తున్న రాజకీయం వలన ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పర్యావరణం, వన్యప్రాణుల రోదనలు మీకు వినిపించడం లేదా రాహుల్ గాంధీ ? అని అన్నారు. విద్యార్థులకు మా పార్టీ తరఫున భరోసా ఇచ్చామని.. బిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా అడుగుతామని స్పష్టం చేశారు. అందుకే పిల్లలు, పర్యావరణం, సెంట్రల్ యూనివర్సిటీ ఏమైనా సరే ఆ భూములు వదిలిపెట్టనని ఈ రోజు అరాచకంగా వ్యవహరిస్తున్నాడన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదు ? వారికి పిల్లల తరఫున నిలబడేందుకు మనసు ఎందుకు రావడం లేదు ? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply