సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విచక్షణ జ్ఞానం లేకుండా సైకోగా మారాడు – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, అద్దం న్యూస్  సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విచక్షణ జ్ఞానం లేకుండా సైకోగా మారాడని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… టిడిపి గుండాల చేతిలో లింగమయ్య కుటుంబం హత్యకు గురయ్యారంటూ ఆరోపిస్తూ లింగయ్య కుటుంబాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లిన తీరు చూస్తుంటే, అది పరామర్శించినట్టు లేదు, ఒక విజయోత్సవ యాత్రను తలపిస్తుందని అన్నారు. ఎక్కువ మందితో వెళ్తున్న ఆయనను అల్లర్లు జరుగుతాయని మందు జాగ్రత్తగా ఆపి, ప్రశ్నించిన పోలీసులపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం, పాపిరెడ్డిపల్లి ఎస్ఐ సుభాష్ యాదవ్ ను తిట్టడం, బట్టలు కూడా తీసి కొడతానని మాట్లాడటం విచారకరమ‌న్నారు. పోలీసు వ్యవస్థ లేనట్లయితే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్ధకం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. పోలీసుల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులను మానవహక్కుల కమీషన్ హ్యూమన్ రైట్స్ కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ బట్టలు కూడా తీసి కొడతానని మాట్లాడటం పూర్తి పోలీసు వ్యవస్థను అవమానపరిచినట్లు భావించాలన్నారు. ఓడిపోయిన ఫస్ స్ట్రేషన్‌లో, మళ్లీ గెలవమని నిరాశ, నిస్పృహలతో నైరాష్ట్యంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. పోలీసులపైనే ఈ విధంగా అరాచకాలకు పాల్పడితే సామాన్యుని పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓడిపోయినప్పటికీ అహంకారం తగ్గకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన, జగన్ నోటి దురదను తగ్గించుకోవాలని అన్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లడిన అప్రజాస్వామ వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటువంటి మాటలు మళ్లీ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకుండా తీవ్రమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, బానుప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page