జమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కమిటీ ఎన్నిక చెల్లదు
– సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 4, అద్దం న్యూస్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు అయిన జమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కమిటీ ఎన్నిక చెల్లదని ఆ సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ముషీరాబాద్‌లోని జెమిస్తాన్‌పూర్ గౌడ సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు జి.శిరీష్ గౌడ్ మాట్లాడుతూ… జెమిస్తాన్‌పూర్ గౌడ సంఘం ఎన్నికలు చెల్లవని… వారికి ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి అధికారాలు లేవన్నారు. 2023 సెప్టెంబర్‌లో సిటీ సివిల్ కోర్టులో రంగకృష్ణ గౌడ్ తో పాటు మరి కొంత మంది కేసు దాఖలు చేశారని… మాజీ అధ్యక్షుడు జిశిరీష్ గౌడ్, మాజీ కార్యదర్శి లింగాల శ్రీకాంత్ గౌడ్ తో పాటు మరి కొంత మంది పై కేసు ఫైల్ చేశారన్నారు. ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ ఉందని, 2025 డిసెంబర్ 10వ తేదీన విచారణ ఉందన్నారు. గతంలో ఉన్నటువంటి కమిటీ సి.ప్రకాష్ గౌడ్, పి.లక్ష్మణ్ గౌడ్, టి.జయహరి గౌడ్ తో పాటు మరికొందరి ఆధ్వర్యంలో గౌడ సంఘం కమిటీ ఉన్నప్పుడు 35 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఆ నిధుల లెక్కలు తేల్చే వరకు ఎటువంటి ఎన్నికలు నిర్వహించరాదని మేము 16 చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు జడ్జికి కౌంటర్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిధుల దుర్వినియోగం పై నగర పోలీస్ కమిషనర్ కు, సెంట్రల్ జోన్ డిసిపికి, చిక్కడపల్లి ఏసిపి కి, ముషీరాబాద్ సిఐ కు ఫిర్యాదులు చేశామని పేర్కొన్నారు. సొసైటీ ఫర్ రిజిస్టర్ వారికి కూడా కోర్ట్ కేసు పెండింగ్‌లో ఉన్న విషయం, 35 లక్షల నిధులు దుర్వినియోగ విషయం పై విచారణ జరపాలని వారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని శిరీష్‌గౌడ్ తెలిపారు.
కాబట్టి కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు ఎటువంటి ఎన్నికలు కానీ… వారు వేసుకున్న కమిటీలు కానీ చెల్లవని స్పష్టం చేశారు. కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసి ఒక ఆడిటర్‌ను నియమించి, లెక్కలు పై విచారణ జరిపిన తరువాతనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీకాంత్ గౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎం.రవీందర్ గౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు పంజాల సూర్య నారాయణ గౌడ్, మేనేజింగ్ కమిటీ మెంబర్ లింగాల కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply