రెండు రోజుల్లో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులు ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 09, అద్దం న్యూస్ : మరో రెండు రోజుల్లో రూ. 26 లక్షల జిహెచ్ఎంసి నిధులతో జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని ప్రారంభించనున్నట్లు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. కార్పొరేటర్ పావని సూచనల మేరకు మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, కమ్యూనిటీహాల్ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ… జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ రెనోవేషన్ కోసం కార్పొరేటర్ పావని జిహెచ్ఎంసి నుంచి రూ.26 లక్షల నిధులను మంజూరు చేయించారన్నారు. కమ్యూనిటీహాల్‌ను మెరుగుపర్చేందుకు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు, మరుగుదొడ్ల రిపేర్లు, నీటి సౌకర్యం కొరకు బోరింగ్ రిపేర్, పెయింటింగ్, నూతన గేటు, హాలు పేరుతో నూతన కమాన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జవహర్‌నగర్ వ్యాయామశాల, ఆట స్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది నాయకులను అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు తప్ప కమ్యూనిటీహాల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సమస్యను స్థానిక కార్పొరేటర్ పావని దృష్టికి తెచ్చిన రోజు నుండి వారు ప్రత్యేక శ్రద్ధ వహించి, అనేక సార్లు కమిటీ సభ్యులను వెంట బెట్టుకొని కమిషనర్, జోనల్ కమిషనర్ల కార్యాలయాలకు వెళ్లి వారి పై ఒత్తిడి తెచ్చి కమ్యూనిటీహాల్ రెనోవేషన్ కోసం పట్టుపట్టి జిహెచ్ఎంసి నిధులు మంజూరు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, సురేష్ రాజు, జవహర్‌నగర్ వ్యాయామశాల ఆటస్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నర్మెట్ట మల్లేష్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఎన్.కృష్ణ, మహేందర్, దినేష్, సలీమ్, గుండు జగదీష్, రాము తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply