హైదరాబాద్, నవంబర్ 7, అద్దం న్యూస్ : భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఏడవ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శంషాబాద్ శ్రీ శ్రీ విద్యారణ్య వేదపాఠశాల వారిచే వేద పఠనం జరిగింది. డాక్టర్.ఎన్. అనంతలక్ష్మీ చెప్పిన ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా విన్నారు.
మాత రమ్యానంద భారతి సందేశం భక్తులను ఆకట్టు కుంది. ప్రాంగణంలోని భక్తులచే లక్ష్మీదేవి విగ్రహాలకు కోటికుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పణ జరిగింది. అలంపురం జోగులాంబ – బాలబ్రహ్మేశ్వర కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణోత్సవం జరుగుతున్న సమయంలో వేదికపైకి కేంద్ర సాంస్కృతిక – పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అతిధిగా వచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply