...

జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే… భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు – నాలుగో స్థానంలో నోటా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్‌ యాదవ్‌ గెలిపొందారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. బిఆర్ఎస్ అభ్య‌ర్థి క‌నీసం ఒక్క రౌండ్‌లో కూడా అధికార పార్టీకి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా, బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. దీంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యంగా షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్‌కు మంచి ఆధిక్యం లభించింది. మరో వైపు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. కౌంటింగ్ మధ్యలో నుంచే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు.

నాలుగో స్థానంలో నోటా :

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ నమోదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఉత్కంఠభరితమైన ఈ ఉప ఎన్నికలో నాలుగో స్థానం ఎవరూ ఊహించని గుర్తుకు దక్కింది. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా లెక్కించిన 1,94,631 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,945, బిఆర్ఎస్‌ అభ్యర్థి సునితకు 74,234 ఓట్లు రాగా.. బిజెపి అభ్యర్థి దీప‌క్ రెడ్డికి 17,041 ఓట్ల‌తో డిపాజిట్ కోల్పోయారు. అయితే 58 మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. నాలుగో స్థానంలో నోటా గుర్తు నిలిచింది. సాధారణంగా నోటాకు పెద్దగా ఓట్లు రావు. అందులోనూ తక్కువ శాతం ఓట్లు పోలయ్యే చోట.. నోటాకు వచ్చే ఓట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నోటా గుర్తుపై ఏకంగా 924 మంది నోటా మీద నొక్కి త‌మ అభిప్రాయాన్ని తెలియ‌చేశారు. అంటే 924 మంది ఓటర్లు తమకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ లాంటి ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికల్లో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా విశేషమే.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.