Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaపోలీస్ కస్టడీలో మృతి చెందిన అలకుంట సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలి

పోలీస్ కస్టడీలో మృతి చెందిన అలకుంట సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

పోలీస్ కస్టడీలో మృతి చెందిన అలకుంట సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలి

– బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : పోలీస్ కస్టడీలో మృతి చెందిన అలకుంట సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం హైద‌రాబాద్ విద్యానగర్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన అలకుంట సంపత్ గల్ఫ్ దేశాలకు మ్యాన్ పవర్ సప్లై లైసెన్స్‌తో కొంత మంది వ్యక్తులకు గల్ఫ్ దేశాలకు పంపారని, వారికి గల్ఫ్‌లో సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదని సంపత్ పై నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారని తెలిపారు. సంపత్‌ను అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు మళ్లీ కోర్టు ద్వారా కస్టడీకి తిసుకోని తీవ్రంగా మానసిక, భౌతికంగా హింసించడం వల్లే సంపత్ మృతి చెందారని బంధువులు చెస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత పోలీస్ అధికారులను డిస్మిస్ చేసి హత్య నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. పోలిసుల సంపత్ ను కస్టడీకి అడిగినప్పుడు సంపత్ కుటుంబ సభ్యులకు గాని.. ఆయన న్యాయవాదిగాని ఎందుకు సమాచారం ఇవ్వాలనేదని ప్రశ్నించారు‌. చట్టాన్ని ధిక్కరించిన నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, సంపత్ కుటుంబ సభ్యులకు యాబై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page