Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaఅభ్యుదయ రచయిత పెనుగొండ అరసం జెండా – తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్‌వి.సత్యనారాయణ

అభ్యుదయ రచయిత పెనుగొండ అరసం జెండా – తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్‌వి.సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జెండా అని ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన పెనుగొండ సన్మాన సభ ఎస్వీ.సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణను శాలువా, మెమెంటో, గజమాలతో అరసం నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ.. అరసం జాతీయ అధ్యక్షుడుగా పెనుగొండ లక్మీనారాయణ పనిచేస్తూనే అనేక విమర్శ గ్రంథాలు రాశారని, ఆయన రాసిన దీపిక విమర్శ గ్రంథానికి అవార్డు రావడం అభినందనీయమని తెలిపారు. అవార్డుకు ఆయన అన్నివిధాలుగా అర్హుడని కొనియాడారు.పెనుగొండ లక్మీనారాయణ అనే దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి ఇతోధిక కృషి చేస్తున్నరన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page