Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadకాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడి

కాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడి

📰 Generate e-Paper Clip

 

కాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడి

♦ వ్యాపారి ఇంట్లో రెండు కేజీల బంగారం మూడు కోట్లు నగదు చోరీ
♦ దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీ చేసిన పని మనుషులు
♦ నిందితులు నేపాల్ కు చెందిన వ్యక్తులుగా గుర్తింపు
♦ నిందితుల గాలింపు కోసం ఆరు బృందాలు ఏర్పాటు

 

కాచిగూడ, ఏప్రిల్ 22, ( అద్దం న్యూస్ ) :   నేపాల్ వ్యక్తులు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి బంగారు నగలు, డబ్బుతో పాటు కారును సైతం దోచుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటన వివరాలను పోలీసులు తెలిపిన ప్రకారం.. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం పక్కన ఉంటున్న హెమ్ రాజ్ దుగ్గల్ ( 62 ), భార్య మీనా దుగ్గల్ ( 59 ), ఇండస్ట్రియలిస్ట్.హెమ్ రాజ్ దుగ్గల్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం నేపాల్ చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ పని మనుషులుగా చేరారు. సోమవారం హెమ్ రాజ్ వాకింగ్ కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్ రాజ్ నెమ్మదిగా డోర్ తీశాడు. భార్య మీనా మత్తులోనే పడి ఉండడం గమనించాడు. వెంటనే ఇరువురిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని భార్య సృహాలో లేనట్లు తెలిసింది. ఈ మత్తు మందు కేసులో 6 గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి కోట్లల్లో డబ్బులు, కిలోల్లో బంగారు నగలు దొంగిలించినట్లు వివరించారు. ఈస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పనిలోచేరిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల కోసం అరు బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page