హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్‌టిలోని శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయం అమ్మవారి కమాన్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వమించారు. ఈ సందర్భంగా కమాన్ నిర్మాణ దాత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, హన్మంత్, ఆనంద్ రావు, చర్ర యాదగిరి, సాయి సంతోష్, సత్యేంధర్, ఎస్ఆర్‌టి కాలనీవాసులు లడ్డు, శివ, పున్న సత్యనారాయణ, గుర్రం గణేష్, ఎం డి.గౌస్, సమర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply