అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకావాలని నిర్ణయించుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా జనవరి 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై జరగనున్న చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనుండగా.. మేడిగడ్డ వైఫల్యాలు , పాత ఒప్పందాల ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల హామీల అమలుపై కేసీఆర్ విమర్శలు, అధికార పక్షం ఇచ్చే సాంకేతిక సమాధానాలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొననుంది.
సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ దళపతి, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోవడంతో.. నేటి నుంచి ప్రారంభం కానున్న సభలో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఖాయమని తేలిపోయింది.
కేసీఆర్ కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై విమర్శనాస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని.. వరి సాగులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కరువు దిశగా కాంగ్రెస్ నెడుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని.. కోటీశ్వరులను చేస్తామనే మాటలు కేవలం గొప్పలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ల పెంపుపై ఇచ్చిన హామీ ఏమైందని ఆయన నిలదీయబోతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply