Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADకెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు.. దొందే – తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు...

కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు.. దొందే – తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి

📰 Generate e-Paper Clip

కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు.. దొందే
– తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి

హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) :  కెసిఆర్, రేవంత్ రెడ్డిలు దొందు దొందే అని.. బీసీల భవిష్యత్తు కవితమ్మతోనే సాధ్యం అవుతుంద‌ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి అన్నారు. ఆదివారం తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఆయ‌న క‌లిశారు. అనంత‌రం రామ‌కోటి మాట్లాడుతూ… బీసీల విద్య, ఉద్యోగ, సామాజిక మరియు రాజకీయ హక్కుల కోసం గత 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో అనేక ఉద్యమాలు నడిపిన తాము, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అటు కెసిఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ “దొందు దొందేష‌ అని విమర్శించారు. వీరు ప్రజలకు, ముఖ్యంగా బీసీలకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మవద్దని రామ‌కోటి పిలుపునిచ్చారు. కెసిఆర్, రేవంత్ రెడ్డిల‌ అబద్ధపు హామీల మూటలను కట్టి బంగాళాఖాతంలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, విద్య, వైద్యం అందించడంలో ఈ నాయకులు విఫలమయ్యారని ధ్వ‌జ‌మెత్తారు.

కవితమ్మతోనే హక్కుల సాధన – మహిళా ప్రాతినిధ్యం :
మురికిలో వికసించిన పవిత్ర కమలంలాంటి టిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవితమ్మ నాయకత్వంలోనే మన హక్కుల సాధన సాధ్యమని రామకోటి ధీమా వ్యక్తం చేశారు. కేవలం హక్కుల సాధనే కాకుండా, మహిళలను అత్యధిక సంఖ్యలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపించే గొప్ప సంకల్పం ఆమెకు ఉందని, తద్వారా బీసీల మనుగడ, అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల ఆత్మగౌరవం నిలబడాలన్నా, సామాజికంగా మనం ఎదగాలన్నా కల్వకుంట్ల కవితమ్మకు, టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page