

హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దే అని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్శిగుట్ట చౌరస్తా వద్ద దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం జరిగింది. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… కెసిఆర్ అనే వాడు ఒక బక్క పలుచని యోధుడని, ఉక్కు సంకల్పంతో.. మహా ఋషిలా కెసిఆర్ తపస్సు చేస్తూ.. మరణం అంచుల్లోకి పోతుంటే అగ్ని గుండమై భగ భగ మండిన రోజు దీక్షా దివస్ అని అన్నారు. 2009 నవంబర్ 29 న వలస పాలనపై అంతిమ సమరానికి తెలంగాణాన్ని కెసిఆర్ సన్నద్ధం చేశారన్నారు. తెలంగాణ నలుదిశలను ఏకం చేసిన రోజు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అని రణగర్జన చేసిన రోజు… కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీని వణికించిన రోజు.. తల్లి తెలంగాణకు వీరతిలకం దిద్దిన రోజు దీక్షా దివస్ అని అన్నారు. పోరు గడ్డపై నిలబడి తెలంగాణ తరఫున కేసీఆర్ చేసిన ఆమ ‘రణం’.. ఒక్క పిలుపుతో కేసీఆర్ వెంట తెలంగాణ జన సైన్యం నడిచిందన్నారు.

1969 నాటి నుంచి సాధ్యం కానీ తెలంగాణను చావో రేవో తేల్చుకుందామని కేసీఆర్ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. దీక్షతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి పోరాడి రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, పులిగిల్ల శ్రీధర్‌చారి, సోమన్, కృపానంద్, శివ, బియ్యం శ్రీనివాస్, జావిద్ ఖాన్, రంగు శ్రీనివాస్, చాకలి శ్రీను, భాస్కర్ నేత, దీన్‌దయాల్ రెడ్డి, శ్రీనివాస్, మున్నా ఖాన్, సత్యనారాయణ బాబు, టిల్లు, గోరఖ్ నాథ్, జార్జ్, శ్రీకాంత్, బల్ల ప్రశాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply