Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadబిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌ గోపి ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ పార్టీ అధినేత‌ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జ‌న్మదిన వేడుక‌లు హైదరాబాద్ న‌గ‌రంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు క‌ల్వ‌గోపి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఇందిరాపార్క్ చౌర‌స్తా వ‌ద్ద పారిశుద్ధ్య కార్మికుల‌కు చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజ‌రై పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా చీర‌ల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జై సింహా, శ్రీనివాస్‌, బల్లెకరి రమేష్, బండ జుగేంధర్, బల్లెకరి రాములు, సామల శ్రీనివాస్, ప్రభాకర్, భీమ్ రాజ్, మధు, వెంకట్, శంకర్, శివ, రమేష్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page