ముషీరాబాద్ డిపో నుంచి
నైట్ రైడర్ ( అర్థరాత్రి బస్సు ) సౌకర్యం ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి నైట్ రైడర్ పేరిట అర్థరాత్రి సమయంలో ప్రజా రవాణా సౌకర్యాన్ని ప్రారంభించినట్టు డిపో మేనేజర్ జె.విజయ్ తెలిపారు. ఐటి ఉద్యోగులకు సౌకర్యార్థం కోసం ఆర్టీసి సంస్థ ఈ బస్సు రవాణాను ప్రారంభించినట్టు తెలిపారు. ఇందు కోసం రూట్ నంబర్ 222ఎ బస్సును కోఠి నుంచి పటాన్‌చెరు వరకు బస్సును అర్థరాత్రి పూట నడపడం జరుగుతుందన్నారు. ఈ బస్సు కోఠి నుంచి ప్రతి రోజు రాత్రి 10:45 గంటలకు, 23:40 గంటలకు, అర్థరాత్రి దాటాక 2:25 గంటలకు తెల్లవారు జామున 3:10 గంటలకు పటాన్‌చెరు కు ప్రయాణిస్తాయన్నారు. అలాగే పటాన్‌చెరు నుంచి అర్థరాత్రి దాటాక 12:40 గంటలకు, రాత్రి ఒంటి గంట 25 నిమిషాలకు, తెల్లవారు జామున 4:10 గంటలకు, 4:55 గంటలకు బస్సులు కోఠికి వస్తాయన్నారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ విజయ్ కోరారు.














Leave a Reply