Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADCM Revanth Reddy : కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌ – సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్...

CM Revanth Reddy : కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌ – సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

📰 Generate e-Paper Clip

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌
– సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు
– రేవంత్ బ్రదర్స్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి లు టార్గెట్ చేశారు
కేసీఆర్ చాలా మంచోడు.. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ మంత్రి ప‌ద‌వి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయ‌డంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశాడన్నారు. తన బర్తరఫ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చాడు.. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. మళ్లీ నేనే సీఎం అనడం.. ఎమ్మెల్యే టికెట్లను సొంతంగా రేవంత్ ప్రకటించడం సరికాదన్నారు. కేసీఆర్ చాలా మంచోడు.. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట కూడా అనలేదని ఆమె స్ప‌ష్టం చేశారు. ఆయనలో ఒక హుందాతనం ఉంటుంది.. మేము ఎప్పుడు వెళ్లినా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాడని తెలిపారు. మేము అడగగానే కేసీఆర్ కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తు చేశారు.

యాదాద్రి పాలకమండలిపై ఎవరి దగ్గరా చర్చించకుండా కమిటీ వేస్తే గొడవలు అయ్యాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా ? లేరని నాకు తెలుసు… ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది.. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండని సురేఖ సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు.. ప్రభుత్వ వ్యతిరేకతపై సర్వే చేయించాలన్నారు. నేను పార్టీని, సీఎంను ఎక్కడా విమర్శించలేదు… అయినా నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని అన్నారు. కనీసం అధిష్ఠానానికి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా అన్యాయంగా బర్తరఫ్ చేశారని, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండని డిమాండ్ చేశారు. సుస్మిత మాటలకు నాకు ఏం సంబంధం ? పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నిస్తుందని తెలిపారు. నేను పార్టీ వదిలి వెళ్లను.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను.. అసెంబ్లీకి కూడా హాజరవుతానని సురేఖ స్ప‌ష్టం చేశారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page