ముఠా జైసింహా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సభకు తరలివెళ్లిన నేతలు

పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, తలసాని శ్రీనివాస్, ముఠా జైసింహా తదితరులు
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ పార్టీ ) రజతోత్సవ సభకు ఆ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండాలవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ చౌరస్తాలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరయ్యారు. అలాగే గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత జైసింహ లు ఆవిష్కరించారు. కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే గోపాల్, జైసింహలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, మీడియా ఇన్చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కరికె కిరణ్‌కుమార్, పోతుల శ్రీకాంత్, పున్నం ప్రవీణ్, శ్రీనివాస్ గుప్త, దీన్‌దయాల్‌రెడ్డి, ఎస్టి.ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply