బిఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లిన నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్‌ల ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి వాహనాల్లో వరంగల్ సభకు తరలివెళ్లారు. సభకు తరలివెళ్లిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వగోపి, రోషం బాలు, కార్తీక్ యాదవ్, సత్యనారాయణ, వెంకటేష్, అరుణ్, అమిత్, మధు, అరవింద్, అజ్జు, సాయి, భాస్కర్, సాయియాదవ్, శ్రీకాంత్, కిట్టు, రాహుల్, నారాయణ, ధర్మేందర్, నందు తదితరులు న్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
