Friday, September 18, 2026
HomeHyderabadశివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరిద్దాం – ప‌లువురు వ‌క్త‌లు

శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరిద్దాం – ప‌లువురు వ‌క్త‌లు

శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరిద్దాం
ప‌లువురు వ‌క్త‌లు

హైదరాబాద్, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ :  శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరించాలని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. గురువారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో విసికె యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్య‌క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ అనే అంశం పై రాష్ట్ర సదస్సును నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా సంగంరెడ్డి పృథ్వీరాజ్, ఆర్య వైశ వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, విసికె రాష్ట్ర అధ్యక్షులు జిలుకర శ్రీనివాస్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పృధ్వీరాజ్ మాట్లాడుతూ…. శివాజీ ఉత్తరాది కేంద్రంగా దేశాన్ని పాలించాలని దురశాపరులకు వ్యతిరేకంగా పోరాడాడని అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది వ్యాపారులు, పెట్టుబడిదారులు స్థానిక వనరులను కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ను యూటీ చేసి, రెండో రాజధాని చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు.

     ఆర్య వైశ వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ… మార్వాడీ వ్యాపారుల వల్ల వైశ్య వర్గంతో పాటు, చిన్న మధ్యతరహా వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడీల చేతిలో తెలంగాణ బంధీ అయ్యిందన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకోవడానికి పోరాటం తప్పా మరో మార్గం లేదని ఆయన అన్నారు. చరిత్రలో ఉత్తరాది మొదటి నుండి ఇతర ప్రాంతాలను ఆక్రమించాలని దండయాత్రలు చేశారని, అదే స్వభావంతో నేటి పాలకులు ఉన్నారన్నారు.

   విసికె రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణలో బిజెపి శివాజీ విగ్రహాలకు, ఫూలే అంబేద్కర్ విగ్రహాల మధ్య వివాదాలు సృష్టిస్తుందని ఆయన అన్నారు. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని, సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విసికె యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ అధ్యక్షత వహించిన ఈ స‌ద‌స్సుకు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కోట రమేష్, విసికె రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరిపల్లి ఆనంద్, అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, రాష్ట్ర కార్యదర్శులు మచ్చ దేవేందర్, అంజయ్య, రతన్ రాజు, సిరిపల్లి రమేష్, రవీందర్, కన్నాల రవి, పిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జై సూర్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు సునీల్, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page