శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడు – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడు
• మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ :   శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడని హ‌ర్యానా రాష్ట్ర‌ మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. ఛత్రపతి శివాజీ 396 వ జయంతి కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్ రాంనగర్‌లోని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నివాసంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఛ‌త్ర‌ప‌తి శివాజి చిత్ర ప‌టానికి బండారు ద‌త్తాత్రేయ‌ పూల‌మాల‌లేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… మొట్ట మొదటి సారి మొఘల్ సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి “హిందూ పద్ పద్ షాహీ ”గా పట్టాభిషేకం పొందడం ద్వారా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారన్నారు. ఆదర్శవంతమైన పరిపాలనగా నిలిచిందని, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు, ధార్మిక భావనలు, సామాజిక చైతన్యం శివాజీ పాలనలో విస్తరించాయని, మహిళలకు సమున్నత గౌరవం కల్పించడం వారి ప్రత్యేకత అని పేర్కొన్నారు. శివాజీ సైన్యంలో కుల వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి ముఖ్యంగా నిమ్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారని తెలిపారు.

రైతులకు కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పన్నుల మినహాయింపులు అందించడంతో పాటు సహకార సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించారని వారి సేవలను కొనియాడారు. హిందూ ధర్మ స్థాపన, గోమాత రక్షణ వంటి ధార్మిక భావనలకు పునాదులు వేసి హిందూ హృదయ సమ్రాట్‌గా నిలిచారని, నేటి యువత శివాజీ ని ఆదర్శంగా తీసుకొని దేశభక్తి, ధర్మరక్షణ కోసం కృషి చేయాలన్నారు. చరిత్రలో శివాజీకి సరైన గుర్తింపు లభించేందుకు అన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆయ‌న చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి శివాజీకి సముచిత స్థానం కల్పించాలని దత్తాత్రేయ కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page