Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమకారుల హామీలను సాధిద్దాం – ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జేఏసి నేత ఎం.న‌ర్స‌య్య‌

మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమకారుల హామీలను సాధిద్దాం – ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జేఏసి నేత ఎం.న‌ర్స‌య్య‌

📰 Generate e-Paper Clip

మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమకారుల హామీలను సాధిద్దాం
» ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జేఏసి నేత ఎం.న‌ర్స‌య్య‌

హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన మార్చి 10 మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సాధిద్దామని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఆనాటి ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం.నరసయ్య అన్నారు. హైద‌రాబాద్‌ రాంనగర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మిలియన్ మార్చ్ కార్యక్రమాల్లో ముషీరాబాద్ జేఏసీది కీలకపాత్రని కొనియాడారు. ముషీరాబాద్ జేఏసీ నేతలు ఆ రోజు ట్యాంక్ బండ్ పై అడుగుపెట్టిన మొదటి జాబితాలో నిలిచారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ముషీరాబాద్ నియోజకవర్గం అత్యంత కీలకంగా పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా ఉద్యమకారులను గుర్తించేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సాధించేందుకు మరింత ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కేబుల్ రవి, రోషం బాలు, కె.వెంకటేశ్వర్లు, ముత్యం బాలరాజు గౌడ్, కాకునూరి సుధాకర్, డేగ‌ల బిక్షపతి యాదవ్, కొండ సహదేవ్, నర్సింగ్ ముదిరాజ్, కమలాకర్ రెడ్డి, కె.శ్రీనివాస్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page