బిసిల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ కోసం పోరాడుదాం – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య‌

 

 బిసిల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ కోసం పోరాడుదాం

– బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య‌

 

ఆర్‌.కృష్ణ‌య్య‌ను స‌న్మానిస్తున్న బిసి నాయ‌కులు

                                                             ఆర్‌.కృష్ణ‌య్య‌ను స‌న్మానిస్తున్న బిసి నాయ‌కులు

హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   బీసీల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ కోసం పోరాడుదామ‌ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య పిలుపునిచ్చారు. జ‌న‌గ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేప‌ధ్యంలో బిసి ఉద్య‌మ నాయ‌కుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య‌కు కృత‌జ్ఞ‌తా స‌భ గురువారం హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగింది. బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌, బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్య‌క్షుడు గుజ్జ స‌త్యం ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ సభ‌లో ఆర్‌.కృష్ణ‌య్య‌కు ఘ‌నంగా స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకం అని అన్నారు. జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి మోడికి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కు కృతజ్ఞతలు తెలియ‌చేస్తున్న‌ట్లు ఆర్‌.కృష్ణ‌య్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే జనగణనలో కులగణనను చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల 40 బి.సి సంఘాలు, కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు. బీసీ సంఘాల, బీసీ -ప్రజల మనోభావాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తరువాత నరేంద్ర మోడి ప్రభుత్వం సాహ‌సోపేత‌ నిర్ణయం తీసుకుందని ప్రశసించారు.

కుల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ. జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల ఆశలకు ఆశయాలకు అలాగే డిమాండ్లకు అనుగుణంగా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లను జనాభా గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన బడ్జెటు కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటివాటికి మార్గం సుస్పష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల స్థానాలను కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు. బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా చేస్తున్న చేస్తున్న ఉద్యమ ఫలించిందని, గత 30 సంవత్సరాల కాలంలో 160 సార్లు ఢిల్లీలో వందల సార్లు హైదరాబాద్ లో ఉద్యమాలు, సభలు పెట్టామ‌న్నారు. ఈ స‌భ‌లో బిసి నాయ‌కులు సిద్ధేశ్వ‌ర్, ఆళ్ల రామృష్ణ‌, వేముల రామ‌కృష్ణ‌, జిల్ల‌ప‌ల్లి అంజి, రాజేంద‌ర్‌, అనంత‌య్య‌, మ‌ల్లేష్ యాద‌వ్‌తో పాటు మున్నూరు కాపు సంఘం అధ్య‌క్షుడు దేవ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page