Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADరంగారెడ్డి కోర్టు ఆవ‌ర‌ణ‌లో లైబ్ర‌రీ దినోత్స‌వం

రంగారెడ్డి కోర్టు ఆవ‌ర‌ణ‌లో లైబ్ర‌రీ దినోత్స‌వం

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి కోర్టు ఆవ‌ర‌ణ‌లో లైబ్ర‌రీ దినోత్స‌వం

రంగారెడ్డి, ఆగ‌స్టు 12, ( అద్దం న్యూస్ ) : ఫాదర్ ఆఫ్ లైబ్రెరీ సైన్స్ ఇన్ ఇండియా డాక్ట‌ర్‌.ఎస్ఆర్. రంగనాథన్ ను స్మరిస్తూ బుధ‌వారం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వ‌ర్యంలో లైబ్రరీ దినోత్సవాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రంగనాథన్ చిత్ర ప‌టానికి తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవర్థన్ రెడ్డి పూల‌మాల‌లేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. గతంలో న్యాయవాద సంఘంలో ఉన్న మాజీ లైబ్రెరీ సెక్రటరీల‌ను శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని స్థానిక సంస్థలు ఆస్తి పన్నుతో పాటు విధిగా లైబ్రరీ సెస్‌ను కూడా వసూలు చేస్తారు.. కానీ ప్రభుత్వం లైబ్రరీల ఏర్పాటుకు సముచిత స్థానం ఇవ్వడం లేదన్నారు. లైబ్రరీల ఏర్పాటుతో పాటు పరిపుష్టిగా పుస్తకాల అందుబాటులో ఉంచడం వల్ల, యువతీ, యువకులు, పిల్లలు, పెద్దలు తమ విరామ సమయాన్ని పుస్తక పఠనం వల్ల సెల్ ఫోన్ వినియోగ వ్యసనం నండి బయటపడి బాగుపడతారని కోరారు.

విదేశాలతో పోలిస్తే మన దేశ లైబ్రరీ వ్యవస్థ అభివృద్ధిలో చాలా వెనకబడ్డాయనేది వాస్తవమ‌న్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని, దీని వల్ల మంచి బాధ్య‌తాయుతమైన వాతావరణం సమాజంలో ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.రవికుమార్, ఉపాధ్య‌క్షుడు రమేష్ కుమార్, జాయింట్ సెక్ర‌ట‌రి పి.మల్లేషం, లైబ్ర‌రీ సెక్ర‌ట‌రీ పిఆర్‌వి.ప్రసాద్, కోశాధికారి మాధ‌వి, కార్య‌వ‌ర్గ స‌భ్యులు నగేష్, నరేష్, విజయ్‌కుమార్, శ్రీకాంత్, స్రవంతి త‌దిత‌ర న్యాయవాదులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page