...

అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థది కీలకపాత్ర – తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ రియాజ్

అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థది కీలకపాత్ర 
– తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ రియాజ్

  రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ రియాజ్‌కు నిరసన సెగ


హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ రియాజ్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో అంధుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన “జ్ఞానజ్యోతి” విభాగం గురువారం ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్‌.రియాజ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మ‌న్‌ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కదిర వన్, దేవనార్ అంధుల పాఠశాల ఛైర్మ‌న్‌ సాయిబాబా గౌడ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ… జ్ఞానజ్యోతి లాంటి విభాగాలు సమానత్వానికి మార్గం వేస్తాయని అన్నారు. ఈ ప్రత్యేక విభాగంలో 1 నుంచి 10 వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత, కథలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు వంటి అనేక విషయాలపై బ్రెయిలీ లిపిలో పుస్తకాలు అందుబాటులో ఉంచారన్నారు. నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మ‌న్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… జ్ఞానజ్యోతి లాంటి విభాగం అంధుల విద్యలో ఒక మైలురాయన్నారు. అంతేకాకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంధ విద్యార్థుల కోసం కంప్యూటర్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎన్‌విడిఎ ( నాన్ విజువ‌ల్ డెస్క్‌టాప్ ఆక్సెస్ ) సాఫ్ట్‌వేర్‌ సహాయంతో విద్యార్థులు స్వయంగా కంప్యూటర్ యాక్సెస్ చేసుకొని వివిధ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు చంద్రకళ, అవినాష్‌, వెంక‌టేశ్వర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, కృష్ణారెడ్డి, మహేందర్, ప్రతిభా రెడ్డి, మంజుల వాణి, శ్రీకాంత్, మహేశ్వరి, స్కూల్ విద్యార్థులు, ఇన్చార్జి రామకృష్ణ, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ రియాజ్‌కు నిరసన సెగ :

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో అంధుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన “జ్ఞానజ్యోతి” విభాగం గురువారం ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ రియాజ్ హాజ‌ర‌య్యారు. డాక్ట‌ర్ రియాజ్ వ‌చ్చి వెళ్తున్న‌ విష‌యం తెలుసుకున్న నిరుద్యోగులు గుమిగూడారు. అధికారంలోకి వ‌స్తే ఉద్యోగాల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసి నిరుద్యోగుల సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, కాంగ్రెస్ నాయ‌కులు ఇదే అశోక్‌న‌గ‌ర్‌కు వ‌చ్చిన వారు ఇప్పుడెందుకు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని డాక్ట‌ర్‌.రియాజ్‌ను నిల‌దీశారు.ఇంకెన్ని సార్లు నిరుద్యోగుల‌ను వాడుకుంటార‌ని ప్ర‌శ్నించారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అడుగుతుంటే త‌ప్పించుకుంటున్నార‌ని, బ‌ల్మూర్ వెంక‌ట్ కూడా నిరుద్యోగుల‌ను మోసం చేశాడ‌ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. స‌మాధానం చెప్ప‌లేక కారులో డాక్ట‌ర్ రియాజ్ వెళ్లిపోయారు. ద్రోహులెవ్వ‌రూ న‌గ‌ర గ్రంథాల‌యానికి రావొద్ద‌ని నినాదాలు చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.