ఏపీ మాదిరిగా తెలంగాణ సీఎం కూడా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి ఏడు వరాల ప్రకటన చేయాలి
– డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్
హైదరాబాద్, డిసెంబర్ 5, అద్దం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడి మాదిరిగా తెలంగాణ సీఎం కూడా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి ఏడు వరాల ప్రకటన చేయాలని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు పేర్కొన్నారు. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏడు వరాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. ఎన్నికల హామీలో దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం, 6000 పెన్షన్ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు కల్పిస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత వరకు హామీని నెరవేర్చలేదన్నారు. ఏపీ సీఎం మాదిరిగా తెలంగాణ సీఎం దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. దివ్యాంగులను విస్మరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతారని వారన్నారు. డిసెంబర్ నెలలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు కూడా 7 వరాలను ప్రకటించాలని కోరారు. లేకపోతే దివ్యాంగులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందన్నారు.













Leave a Reply