చెట్టు కొమ్మలు తొలగించేందుకు సహకరించిన కార్పొరేటర్ ఎ.పావనికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

చెట్టు కొమ్మలు తొలగించేందుకు సహకరించిన కార్పొరేటర్ ఎ.పావనికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప్ర‌జాసాయి ఆసుప‌త్రి స‌మీపంలో లహరి అపార్ట్‌మెంట్‌ వద్ద గత కొన్ని ఏళ్లుగా భారీ చెట్టు కొమ్మలు పెరిగి హై టెన్షన్ విద్యుత్ తీగలపై పడి ప్రమాదకరంగా ఉంద‌నే సమస్యను స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పావ‌ని ప్రత్యేక చొరవతో టిజిఎస్‌పిడిసిఎల్‌, హార్టిక‌ల్చ‌ర్ శాఖ‌లు, జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించి ప్ర‌మాద స‌మ‌స్య‌ను వివ‌రించారు. శ‌నివారం ఆ చెట్టు కొమ్మ‌ల‌ను ద‌గ్గ‌రుండి తొల‌గింప‌చేశారు. గత 5 ఏళ్లుగా చెట్టు కొమ్మలతో ఉన్న‌ప్రమాదకర సమస్యను పరిష్కరించినందుకు అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు క‌లిసి కార్పొరేటర్ పావ‌నికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌, టిజిఎస్‌పిడిసిఎల్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిబిడి.వినోద్ కుమార్, ఏఈ వేణుగోపాల్, ఏడి శ్రీనివాస్, అశోక్‌న‌గ‌ర్ ఏఈ గోపాల కృష్ణ, హార్టికల్చర్ మేనేజర్ ధీరజ్, శ్యామల, వారి సిబ్బంది, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, నేతలు శివ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి కుమార్, రఘు యాదవ్, సంయుక్తా రాణి, అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానికులు గణేష్, రమేష్, విశ్వనాథ్, వెంకటరమణ, చింతామణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page