వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు
ముషీరాబాద్, ఫిబ్రవరి 15, అద్దం న్యూస్ : మహా శివరాత్రి మహోత్సవాలు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ భవాని శంకరాలయంలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కుమార్ దంపతులు శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ భోళా శంకరుడి దయ డివిజన్ ప్రజలపై ఉండి వారికి ఎల్లప్పుడూ ధైర్యాన్ని, విజయాల్ని ప్రసాదించాలి శివయ్యను వేడుకుంటూ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మాచర్ల దేవనాథం, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, నాయకులు నర్సింగ్ రావు, సురేష్ రాజు, జ్ఞానేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply