Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadగాంధీన‌గ‌ర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు

గాంధీన‌గ‌ర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు

📰 Generate e-Paper Clip

గాంధీన‌గ‌ర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :    మ‌హాత్మాగాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గురువారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై గాంధీ విగ్ర‌హానికి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… స్వాతంత్య్ర‌ సమరయోధులుగా మన దేశానికి, ప్రజలకు మ‌హ‌నీయులు అందించిన సేవలను కొనియాడారు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విదేశీ వస్తువులు నిషేధించి, స్వదేశీ వస్తులను వాడాలని, ప్రతి ఒక్కరు ఈ ప్రత్యేక రోజున ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని తద్వరా స్వదేశీ కీర్తి ప్రతిష్టలు ముర్తిభావించేందుకు దోహదపడతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, కృష్ణ ప్రసాద్, ఎం .ఉమేష్, వాణి శాస్త్రి, సురేష్ రాజు, శ్రీనివాస్ యాదవ్, మదన్మోహన్, లక్ష్మణ్ యాదవ్, నీరజ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంపత్ యాదవ్, రాజ్‌కుమార్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page