సిసి రోడ్డు నిర్మాణ పనిలో నాణ్యతను పాటించండి
– గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ : సిసి రోడ్డు నిర్మాణ పనిలో నాణ్యతను పాటించాలని కాంట్రాక్టర్‌కు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బాలాజి ఇంధ్రప్రస్థ చౌరస్తా మళ్యాలం చర్చీ వరకు ఇటీవల రూ.1 రూపాయల నిధులతో జరుగుతున్న నూతన సిసి రోడ్డు పనులను మంగళవారం స్థానిక మాజీ కార్పొరేటర్ ఎ.పావని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పావని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. జిహెచ్ఎంసి నుంచి కార్పొరేటర్ బడ్జెట్ నుంచి రూ.1 కోటి రూపాయలను మంజూరు చేయించానని పావని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వీలైనంత త్వరగా సిసి రోడ్డు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, బాలకృష్ణ, ముత్యాలు, వంజరి నవీన్, మహమూద్, సాయి కుమార్, శివ కృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.![]()

![]()

