అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించండి
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించేలా చూడాలని జిహెచ్ఎంసి అధికారులకు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాలు చేశారు. నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్ లక్ష్మమ్మ పార్క్ వీధిలో రూ. 30 లక్షల నిధులతో ప్రారంభమైన సిసి రోడ్డు పనులను బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిసి రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించేలా చూడాలని జిహెచ్ఎంసి డిఈ సన్ని, ఏఈ విశేష్‌నాయక్ లకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోషం బాలు, సురేందర్, రఘు, మేడి సత్యనారాయణ, జిహెచ్ఎంసి వర్క్ ఇన్‌స్పెక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply