Sunday, September 20, 2026
No menu items!
HomeAPగుడివాడలో భారీ అగ్నిప్రమాదం

గుడివాడలో భారీ అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్‌ఫోన్‌ దుకాణంలో వచ్చిన మంటలు.. క్రమంగా మిగతా షాపులకు వ్యాపించాయి. ఇదే కాంప్లెక్స్‌లో జూనియర్‌ కళాశాల, ఎస్‌బీఐ శాఖలు ఉన్నాయి.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఆంజనేయులు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page