...

రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద‌ ఏర్పాట్ల‌ను చేయండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద‌ ఏర్పాట్ల‌ను చేయండి
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :    రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద అన్ని ఏర్పాట్ల‌ను చేయాల‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ఫాతిమా బేగం మ‌సీదు వ‌ద్ద రంజాన్ మాసం ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే గోపాల్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రంజాన్ మాసమంతా మసీదుల వ‌ద్ద లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామ‌న్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫాతిమా మ‌సీదు అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ జ‌హంగీర్‌, ఖాసీమ్‌, ఖైసర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మ‌హ్మ‌ద్ ఖ‌దీర్‌, గౌస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.