Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadపాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయండి – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్...

పాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయండి – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్

📰 Generate e-Paper Clip

పాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయండి

– తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్


హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ :   పాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జులై 31 ( నేటి నుంచి ) ఆగ‌స్టు 6వ తేదీ వ‌ర‌కు పాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం నిర్వ‌హిస్తున్న నేప‌ధ్యంలో బుధ‌వారం టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ నాయ‌కుడు బొద్దిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఈవి.శ్రీనివాస్‌, ఏఐసిసి కార్య‌ద‌ర్శి విశ్వ‌నాథ‌న్ లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌, శ్ర‌మ‌దానం, పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాల విజ‌య‌వంతం చేయ‌డం కోసం త‌గిన‌, సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడం, పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుండి మరింత పటిష్టం చేయడం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలసి ఇంటరాక్షన్ సమన్వయం సమాలోచన తదితర కార్యక్రమాలను నిర్వహించడము జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్ ను సంసిద్ధత చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవి శ్రీనివాస్ లు మాట్లాడుతూ… ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పాద యాత్ర, శ్రమదానం, కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. వివిధ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల ఇన్‌చార్జులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించిన‌ట్టు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page